మద్నూర్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి (Salabatpur temple) నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని పెద్ద శక్కర్గ గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ లింగప్ప పటేల్, మాజీ ఎంపీపీ అనుసుయబాయి కుమారుడు రామ్పటేల్ (Ram Patel) ను చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలయ ధర్మకర్తల సభ్యులుగా శ్రీనివాస్, కైలాష్, నాగనాథ్, కుశాల్ రావు, పండరి, లక్ష్మీబాయిని నియమించారు. తనకు ఆలయ చైర్మన్ గా నియమించినందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు నూతన చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని, తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తుల ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి సేవలో ఉంటూ, భక్తులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రాబోయే హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని నూతన చైర్మన్ రాంపటేల్ వెల్లడించారు.