పలుచోట్ల ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు
బోధన్‌లో కురిసిన వడగండ్లు
ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోగురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బోధన్ పట్టణంలో వడగండ్లు కురిశాయి. మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఎల్లారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది.