సిటీబ్యూరో, జనవరి 18(నమస్తే తెలంగాణ): రైల్వే నిర్వహణ, పలు కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తూ రైల్వే అధికారులు గురువారం ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. దాండ్ – నిజామాబాద్, నిజామాబాద్ – పందాపూర్ స్టేషన్ల మధ్య రెండు రైళ్లను పాత టైమ్‌టేబుల్ ప్రకారం యథావిధిగా నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే, ధర్మాబాద్ – మన్మాడ్, ఔరంగాబాద్ – హైదరాబాద్, నాగర్సోల్ – నర్సాపూర్, ముంబై సీఎస్ఎంటీ – నాందేడ్, నాందేడ్ – పూణె, కాచిగూడ – నాగర్సోల్ స్టేషన్ల మధ్య నిలిచిపోయిన ఆరు రైళ్లను తిరిగి ఈ నెల 20 నుంచి షెడ్యూల్ ప్రకారం నడిపించనున్నామని అధికారులు పేర్కొన్నారు.
* సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్‌కు సంబంధించి నాందేడ్ – బెంగళూరు రైల్వే స్టేషన్ల మధ్య నడిచే రైలును యలహంక – కేఎస్ఆర్ బెంగుళూరు స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
* న్యూఢిల్లీ – హైదరాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న రైలు ఈ నెల 20న రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.