CP Sai Chaitanya | ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం.. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరో టౌన్ పోలీసు సిబ్బందిని సీపీ మంగళవారం అభినందించారు.
- విపత్తు సమయంలో సేవలందించిన పోలీస్ సిబ్బందికి సీపీ అభినందనలు
CP Sai Chaitanya | వినాయక్ నగర్, ఆగస్టు 4 : ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరో టౌన్ పోలీసు సిబ్బందిని సీపీ మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారి పై భారీగా వరద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో టౌన్-6 ఎస్ఐ కే సందీప్ ఆదేశాలతో ఏఎస్ఐ జక్రయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా హుటాహుటిన స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను సమర్థవంతంగా నియత్రించినట్లుగా సీపీ పేర్కొన్నారు. భారీ వర్షం నీరు కారణంగా డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో వరద నీటి ప్రవాహం రోడ్డుపై నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడగా దాన్ని గమనించిన పోలీస్ సిబ్బంది , సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి జేసీబీల సహాయంతో ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేయించినట్లు చెప్పారు. దీంతో రహదారిపై రాకపోకలు మళ్లీ ప్రారంభమైనట్లు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత అంకితభావంతో విధులు నిర్వహించిన 6 టౌన్ పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శాలువాలతో ప్రత్యేకంగా సత్కరించి, అభినందిస్తూ ప్రశంసించారు. ఇదే సేవాస్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , ఆరవ టౌన్ ఎస్సై సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

