డిచ్పల్లి, జూలై 17 : అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు డిచ్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. భీమ్‌గల్ మాజీ ఎంపీపీ మహేశ్‌ను పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వేముల ఇంటిపై దాడిచేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయకుండా మాజీ ఎంపీపీని అరెస్టు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గురువారం రాత్రి జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు డిచ్పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అరెస్టయిన వారితో మాట్లాడారు.
అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని, అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. డిచ్పల్లి మండల నాయకుడు శక్కరికొండ కృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులపై దాడు లు, అక్రమ కేసులు బనాయించడం అధికమ య్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. జడ్పీ మాజీ చైర్మన్ వెంట కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రమణారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రావు, ఇందల్వాయి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి దాస్, మాజీ సర్పంచ్ పాశం కుమార్, నాయకులు ఒడ్డెం నర్సయ్య, అరటి రఘు, సుందర్ తదితరులు ఉన్నారు.