Bodhan | బోధన్‌లో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి
బోధన్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వర్ణకార సంఘం భవనంలో ఆయన చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వర్ణకార సంఘం భవనంలో ఆయన చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి మారోజు సుధాకర్ చారి, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు హనుమాన్లు చారి మాట్లాడుతూ జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రధాన సిద్ధాంతకర్త అని గుర్తు చేశారు.
తన జీవితాన్ని ప్రాంతీయ హక్కుల పరిరక్షణకు అంకితం చేశారని, కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సిలర్‌గా పనిచేసిన గొప్ప విద్యావేత్త అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం నాయకులు త్రివేణి నాగరాజు చారి, నారోజు వెంకట రమణాచారి, కన్నోజ్వర్ బాలాజీ చారీ, హుంసా ధర్మపురి చారి, కందుకూరు సత్యనారాయణ చారి, నాగ బ్రహ్మచారి, నరేష్ చారి, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

