పోతంగల్ మే 10: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని (బాలాజీ మందిర్) శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు బజరంగ్ హన్మండ్లు మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని భగవంతుడిని ప్రార్థించామన్నారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులు యుద్దనీ జయించి సురక్షితంగా తిరిగి రావాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు సైనికులకు సంఘీభావంగా ర్యాలీలు, ప్రత్యేక పూజలు చేయాలన్నారు. భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికి కూడా పాకిస్థాన్ వంటి దేశాలు భయపడే విధంగా మన సైనికులు చేస్తున్న పోరాటానికి మనమంతా అండగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గంగారం, అశోక్, శంకర్, హాన్మండ్లు, సాయిరాం, సాయిలు, కిష్టయ్య తదితరులున్నారు.