కామారెడ్డి : అమరజీవి పొట్టి శ్రీరాములు ( Potti Sriramulu ) 123 వ జన్మదిన వేడుకలను కామారెడ్డి ( Kamareddy) పట్టణంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ తరఫున పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ( University) పేరును మార్చవద్దని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో కామారెడ్డి వాసవి క్లబ్ అధ్యక్షుడు గరిపల్లి శ్రీధర్ గుప్తా, రీజినల్ చైర్మన్ మొటూరు శ్రీకాంత్ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ గుప్తా, కూర శ్రీనివాస్ గుప్తా , వలిబిశెట్టి భాస్కర్ గుప్తా, యాదాంజయ గుప్తా, యాదా అంజయ్య గుప్తా , విశ్వం గుప్తా , బొమ్మరిల్లు శ్రీనివాసు గుప్తా , ఆకుల నారాయణ గుప్తా, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.