కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునపల్లి పీఎస్ పరిధిలో ఆదివారం పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ బలగాలు కవాతును ( Police parade) నిర్వహించాయి. రూరల్ సీఐ రామన్, ఎస్సై రాజు, ఆర్ఏఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో కాకతీయ నగర్, గాయత్రి నగర్, దేవునపల్లి, సారంపల్లిలో కవాతును నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించినట్లు పోలీసు అధికారులు వివరించారు. కాలనీవాసులు శాంతి భద్రల పరిరక్షణకు పోలీసులతో సహకరించాలని సూచించారు. అనుమానితులు సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.