సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
- సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని శుక్రవారం బాన్సువాడలో ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా బాన్సువాడలోని స్పీకర్ స్వగృహంలో కేక్ కట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్, స్థానిక నాయకులకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. పేదల పెన్నిధి, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, సమాజానికి సేవ చేయడానికి భగవంతుడు వారికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ఏ పథకం అమలు చేసినా అది ప్రజల గుండెలకు హత్తుకుంటుందని చెప్పారు. కేవలం 8 ఏండ్లలోనే రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చారన్నారు. కానీ కొంతమంది కళ్లు ఉండి చూడలేక, చెవులు ఉండి వినలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటారని, వారి పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాలు ఉన్నా యా అని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ర్టాలు కూడా తెలంగాణ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ సహాయ, సహకారాలతోనే బాన్సువాడ నియోజక వర్గంలో అభివృద్ధి సాధించగలిగినట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, నాయకులు దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, పోతుల బొగుడ గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివా స్, లింగమేశ్వర్ , రాజేశ్వర్ గౌడ్, దాసరి శ్రీనివా స్, బాబా, రమాదేవి, గైక్వాడ్ రుక్మిణి, అందెరాజు, ఇలియాస్, శ్రీకాంత్, గంగాధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

