హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన హరితహారం ఫలాలు ప్రస్తుతం కండ్లముందు కనిపిస్తున్నాయి.
అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి తోరణాల మాదిరి స్వాగతం పలుకుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని గుండారం నుంచి మల్కాపూర్ వైపు వెళ్లేదారిలో కనిపించిన ఈ దృశ్యాలను నమస్తే తెలంగాణ క్లిక్‌మనిపించింది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్