బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గాంధారి, ఏప్రిల్ 23: బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్ కలాన్, కర్ణంగడ్డ తండాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివాజీరావు, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డి రాజు, వైస్ ఎంపీపీ భజన్లాల్తోపాటు పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతోపాటు సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచించారు. గాంధారి మండలంలోని వెంకటాపూర్, పొతంగల్ కలాన్, చద్మల్తండా, తిప్పారం తదితర గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను ఆయన పరిశీలించారు. పొతంగల్ కలాన్ గ్రామంలో కార్యకర్తలతో సమావేశమై పలు సూచనలు చేశారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలన్నారు. ఈ నెల 25న ఎల్లారెడ్డిలో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళన్నాన్ని నిర్వహిస్తున్నామని, అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఉదయం 8 గంటలకు అన్ని గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షులు బీఆర్ఎస్ జెండాలను ఎగురవేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నచ్చడంతోనే బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరాను. సీఎం కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామం అభివృద్ధికి నోచుకుంటున్నది.
-శ్రీనివాస్ నాయక్, కర్ణంగడ్డ తండా, గాంధారి మండలం