ఎడపల్లి/ సిరికొండ/ చందూర్, ఏప్రిల్ 10 : ఎడపల్లి మండలం ఒడ్డపల్లి గ్రామంలో సోమవారం కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, సర్పంచ్ కూరెళ్ల శ్రీధర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వనజానాగరాజు, కార్యదర్శి గంగాధర్, కంటి వెలుగు ఇన్చార్జి డాక్టర్ రాజ్ కుమార్, ఆయుష్ డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని పందిమడుగు గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని సర్పంచ్ సర్దాని భాగ్యలక్ష్మి సోమవారం ప్రారంభించారు. 18 ఏండ్లు నిండిన వారు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మలావత్ మోహన్, గంగానర్సయ్య, ధర్మపురి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.చందూర్ మండల కారేగాం గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఏఎంసీ చైర్పర్సన్ కవితాఅంబర్సింగ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంగోత్ దేవీసింగ్, కార్యదర్శి దుర్గాప్రసాద్, తారాసింగ్, రవి, వైద్యులు, నాయకులు పాల్గొన్నారు.
కంటి వెలుగు సిబ్బందికి సన్మానం
కమ్మర్పల్లి మండలం ఉప్లూర్‌లో కంటి వెలుగు శిబిరం విజయవంతమైందుకు సోమవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కంటి వెలుగు సిబ్బందిని సన్మానించారు. మెడికల్ ఆఫీసర్ నర్సింహస్వామి, కంటి వైద్యుడు శివ, హెచ్ఇవో మహేందర్, హెల్త్ సూపర్వైజర్ ఎస్తేర్, డీఏవో అభినవ్, ఏఎన్ఎంలు అరుణ కుమారి, స్వరూప, ఎంఎల్‌హెచ్‌పీ దివ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లను సర్పంచ్ బద్దం పద్మా చిన్నారెడ్డి సన్మానించారు. శిబిరంలో 2706 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 224 మందికి దగ్గర చూపు అద్దాలు అందజేశామని వైద్యులు తెలిపారు. 165 మందికి దూరపు చూపు అద్దాలు అందాయని, మరో 117 మందికి త్వరలో అందుతాయని వివరించారు. మోతి బిందు ఆపరేషన్ల కోసం 330 మందిని జిల్లా కేంద్ర దవాఖానకు సిఫారసు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్‌రెడ్డి, ఉప సర్పంచ్ నందగిరి రేఖ శ్రీధర్, జీపీ కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో కంటివెలుగు శిబిరం ముగిసిందని వైద్యాధికారిణి ప్రమోదితా తెలిపారు. ఈశిబిరంలలో 2,381 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కంటి వెలుగు వైద్య సిబ్బందిని సర్పంచ్ వికార్‌పాషా ఆధ్వర్యంలో సన్మానించారు. కందకుర్తి, తాడ్‌బిలోలి గ్రామాల్లో మంగళవారం కంటివెలుగు శిబిరాలు ప్రారంభించనున్నట్లు సర్పంచులు ఖలీంబేగ్, సునితా నర్సయ్య తెలిపారు.