PCC | కంటేశ్వర్ జూన్ 25 : నూతనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి గా నియమింపబడిన రాంభూపాల్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణ కు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో ను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రామ్ భూపాల్, రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమపై నమ్మకం తో ఈ పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, నవాజ్, ప్రీతం, మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, మాజీ కార్పొరేటర్ విజయ, కొండపాక రాజేష్, లవంగ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.