పెద్ద కొడప్గల్, (పిట్లం) : దివ్యాంగ చిన్నారులకు ప్రతిరోజు ఫిజియోథెరపీ(Physiotherapy) చేయిస్తే ఫలితాలు వస్తాయని డాక్టర్ సారిక అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం(Pitlam) మండల కేంద్రంలోని భవిత సెంటర్లో దివ్యాంగ చిన్నారులకు శుక్రవారం ఫిజియోథెరపీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిబిరంలో 8 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామని అన్నారు. దివ్యాంగులపై చిన్నచూపు చూడవద్దని, వారిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని అన్నారు. భవిత సెంటర్లో నిర్వహించే ఫిజియోథెరపీ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కిషోర్, గంగాధర్, అంబయ్య తదితరులు పాల్గొన్నారు.