నిజామాబాద్ క్రైం, జనవరి 11: నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైన కేసీఆర్ కప్-23 కబడ్డీ పోటీలు రెండో రోజైన బుధవారం ఫుల్ జోష్‌గా కొనసాగా యి. వివిధ మండలాల నుంచి వచ్చిన జట్లు గెలుపే లక్ష్యంగా తమ ప్రత్యర్థి జట్లతో తలపడ్డాయి. బుధవారం పోటీలను పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి కమలాకర్‌రావు, జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు, కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షుడు రమణారావు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని ఆల్‌ది బెస్ట్ చెప్పారు.
గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ఆడాలని ఈ సందర్భంగా అతిథు లు సూచించారు. మొదటిరోజు 26 జట్లు తలపడగా, రెండోరోజు నాక్ అవుట్, లీగ్ మ్యాచ్‌లు నిర్వహించగా తొమ్మిది జట్లు పాల్గొన్నాయి. రిఫరీలుగా పీఈటీలు సాయాగౌడ్, సుబ్బారావు, ప్రశాంత్, స్వామి వ్యవహరించారు. రెండో రోజు జరిగిన పోటీలను నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్ ఖుద్దుస్, తారిక్ అన్సారీ తిలకించారు.
గురువారం సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ఆర్టీఏ కమిషనర్, కేసీఆర్ సేవాదళం వ్యవస్థాపకుడు డాక్టర్ మహ్మద్ అమీర్ హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. విజేత జట్టుకు రూ. 50 వేలు, రన్నరప్ జట్టుకు రూ. 30 వేలు, తృతీయ స్థానం సాధించినవారికి రూ. 10వేల నగదు బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు.