రాజంపేట్, సెప్టెంబర్ 16: బీఆర్ఎస్లోకి వలసల జోరుకొనసాగుతున్నది. మండలంలోని పొందుర్తి గ్రామంలో బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు బిక్కి నర్సింహులుతోపాటు యువకులు శనివారం ప్రభు త్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ప్రభుత్వ విప్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కమ్మరి రాజు, బిక్కి రాజు, బిక్కి నవీన్, చాకలి భూమయ్య, ఆత్మకూరి సుదర్శన్, పయ్యర్ల రాజ గౌడ్, వెల్మ శ్రీనివాస్, కుమ్మరి బాల కిషన్, ర్యానబోయిన బాబు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాక్కాజి బల్వంత రావు, పొందుర్తి గ్రామ సర్పంచ్ గంగా కిషన్,ఎంపీటీసీ తాటిపాముల బాల్‌రాజ్ గౌడ్, సీనియర్ నాయకులు లింగాల కృష్ణమూర్తి, జూకం టి మో హన్ రెడ్డి, నల్లవెల్లి అశోక్, ఎల్లయ్య, పెం ట య్య, శ్రీధర్, విఠల్, నర్సింహులు, రమేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో..
బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామం సీనియర్ నాయకుడు పురుషోత్తం పటేల్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జుక్కల్‌తో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్‌పటేల్, పార్టీ మండల అధ్యక్షుడే వెంకట్రావ్దేశాయ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బస్వరాజ్ పటేల్, సీనియర్ నాయకులు భూమిశెట్టి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సిద్దిరాంపటేల్, వాజిద్నగర్ ఎంపీటీసీ సాయిలు, నాయకులు సాయాగౌడ్, విజయ్సేట్ తదితరులు పాల్గొన్నారు.