బాల్కొండ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని బస్సాపూర్ శివారులో ఆదివారం శ్రీరాంసాగర్ ( Sriram Sagar) వరద కాలువలో పడి ఒకరు గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన బీర్ సింగ్ మారాబి (40) అనే యువకుడు గత కొద్ది రోజులుగా బస్సాపూర్ లో తాపీ మేస్త్రి(Mason) వద్ద కూలి పనిచేస్తుండేవాడని వివరించారు.
ఆదివారం సెలవు కావడంతో తన సెల్ఫోన్ రిపేర్ చేసుకుని తిరిగి వరద కాలువ సమీపం నుంచి బస్సాపూర్ వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు కాలువల పడి గల్లంతయ్యాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గల్లంతైన వ్యక్తి కోసం కాలువలో గాలిస్తున్నారు.