కోటగిరి : ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందించాలని కోటగిరి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి (MPDO Srinivas reddy) అన్నారు. శనివారం మండల కేంద్రం మాలివాడ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టికను (Attendence Register) , పాఠశాల పరిసరాలను పరిశీలించారు. వంట పాత్రలను శుభ్రంగా ఉంచాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులు ఎంతమంది ఉన్నారని ప్రధానోపాధ్యాయుడు శానం సాయిలును అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సౌకర్యాల మెరుగుపై సంతృప్తి వ్యక్తం చేశారు.