Crop Rotation | పోతంగల్ మే 29: ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల పొలాల్లో భూసారం తగ్గుతుందని దీంతో పంట దిగుబడి తగ్గుతుందని, పంటల మార్పిడీ వల్ల భూమిలోని పోషకాలు సంవృద్ధిగా అందుతాయని సస్యరక్షణ శాస్త్రవేత్త పీ విజయ్ కుమార్ అన్నారు. మండలంలోని హెగ్డోలి లో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అనుసంధానంతో రైతులకి రైతు మంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
యూరియా వాడకాన్ని తగ్గించడం, అవసరం మేరకే రసాయనాల వినియోగంపై శాస్త్ర వేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఎరువుల దుకాణాల్లో కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, పంట పూర్తయ్యే వరకు దానిని భద్రపరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు, పుప్పాల శంకర్, డాక్టర్ ఎం శ్వేత, మండల వ్యవసాయ అధికారి నిషిత, పశు వైద్య అధికారి సురేష్ కుమార్, రైతులు నాగం సాయిలు, అర్జున్ రావు, సాయినాథ్, శివరాజ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.