NRI | శక్కర్ నగర్ : బోధన్ పట్నం శక్కర్ నగర్లో జరిగిన ప్రమాదంలో గాయాలపాలైన అజయ్ కుమార్ అనే బాలుడికి ఐ లవ్ శక్కర్ నగర్ వ్యవస్థాపకులు- ఎన్ఆర్ఐ నాగేంద్రబాబు ఆర్థిక సాయం పంపారు. అజయ్ కుమార్ అనే బాలుడికి గాయాలైన సంగతిని సదరు స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ప్రభావతి, కార్యదర్శి దమ్మల్ల జ్యోతి రాజు ప్రమాద విషయాన్ని అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ నాగేంద్రబాబుకు వివరించారు.
అజయ్ కుమార్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో వారికి తన వంతు సాయంగా నాగేంద్రబాబు రూ.10వేల సాయం పంపారు. ఈ డబ్బులను బోధన్ సీఎస్ఐ చర్చి ఫాదర్ రెవరెండ్ మునకల ప్రభాకర్, ప్రభావతి, జ్యోతి రాజు చేతుల మీదుగా బాలుడికి, అతని తండ్రి శాంతి కుమార్కు అందజేశారు. అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు తమకు సాయం అందజేసిన నాగేంద్రబాబుకు, ప్రమాదం సంగతి నాగేంద్ర బాబుకు వివరించిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.