జిల్లాలో ప్రొటోకాల్ గాడి తప్పింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటనలో మరోసారి ఇది పునరావృతమైంది. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు సునీల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి వేదికపై ఆసీనులవడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది.
ఎలాంటి పదవీ లేకపోయినా అధికారిక సమీక్షలో ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, లక్ష్మీకాంతారావు పక్కన కూర్చోవడం ముక్కున వేసుకునేలా చేసింది. జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమాలు జరిగినా కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్ పాటించడం లేదని రాద్ధాంతం జరుగుతున్నా.. ఓ వైపు మంత్రి, మరోవైపు కలెక్టర్ సాక్షిగా ఈ తతంగం జరగడం చర్చనీయాంశమైంది. – కంఠేశ్వర్, నవంబర్ 29