నిజాంసాగర్, సెప్టెంబర్ 15 : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం ఎగువప్రాంతం నుంచి 6500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ(విద్యుత్ ఉత్పత్తి కేంద్రం) ద్వారా 2200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద గేట్లను ముసివేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా, 1404.98 అడుగుల (17.773 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నదని పేర్కొన్నారు.
మోర్తాడ్, సెప్టెంబర్ 15: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతోంది. ఆదివారం ప్రాజెక్ట్‌లోకి 27,315 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా, ప్రాజెక్ట్‌లో 1091అడుగుల(80.501టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 27,315 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా ఇందులో కాకతీయ కాలువకు 6800, లక్ష్మీకాలువకు 200, మిషన్‌భగీరథకు 231, సరస్వతీకాలువకు 400, వరదకాలువకు 19వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.