నిజాంసాగర్ : బీసీ హాస్టల్ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతల శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం నిజాంసాగర్లోని బీసీ హాస్టల్(BC hostel issues) ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో నీటి వసతి ( Water Problem )సరిగా లేదని, టాయిలెట్లు ( Toilets ) సక్రమంగా లేవని ఆరోపించారు.
హాస్టల్ బిల్డింగ్ పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్కు ఇన్చార్జి వార్డెన్ ఉండడంవల్ల పర్యవేక్షణ కరువైందని పేర్కొన్నారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు, మెనూ ప్రకారం భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లోక సంతోష్, శ్రవణ్ కుమార్ గౌడ్, ఆకుల లక్ష్మణ్ యాదవ్, నాగరాజ్, గాజుల చంద్రశేఖర్,అఫ్రోజు పాల్గొన్నారు.