వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
బోధన్ పట్టణం శక్కర్‌నగర్‌లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మల్లాది వెంకట కృష్ణశర్మ, విజయభారతి దంపతులు శ్రీరామ పట్టాభిషేకాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిపించారు.
బోధన్, ఏప్రిల్ 11: బోధన్ పట్టణం శక్కర్‌నగర్‌లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మల్లాది వెంకట కృష్ణశర్మ, విజయభారతి దంపతులు శ్రీరామ పట్టాభిషేకాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిపించారు. వేద పండితుడు ప్రవీణ్ మహరాజ్ ఆధ్వర్యంలో పలువురు పండితులు శ్రీరామ ట్టాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మల్లాది వెంకటేశ్వర శర్మ, కోశాధికారి లక్ష్మణగుప్తా, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
శ్రీరామ మఠంలో సీతారాముల కల్యాణం..
ఎడపల్లిలోని శ్రీరామ మఠం ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మఠాధిపతి అన్న మహారాజ్ పర్యవేక్షణలో మఠాధిపతి వంశజులు శ్రీ పరశురాం మహరాజ్, సురేశ్ ఆత్మారాం మహరాజ్తోపాటు వారి కుటుంబీకులు, పలువురు అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య జరిపించారు. కార్యక్రమాలకు స్థానిక సర్పంచ్ ఆకుల మాధవి – శ్రీనివాస్ దంపతులు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తరఫున మాజీ జడ్పీటీసీ పులి శ్రీనివాస్ పట్టు వస్ర్తాలను సమర్పించారు. స్థానిక పురోహితులు మహేశ్ జోషి, రాజేశ్ జోషి, శ్రీపాద శర్మతో పాటు పలువురు తమవంతు సేవలు అందించారు. కార్యక్రమాలకు బోధన్ ఏసీపీ రామారావు, ఎడపల్లి ఎస్సై పాండేరావు, గ్రామ పెద్ద రామ్రావు దేశాయ్, స్థానిక జడ్పీటీసీ , జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం.రజితాయాదవ్, ఎంపీటీసీ గుంజరి మనీషా రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు పోల మల్కారెడ్డి, కరణం శంకర్ రావు, ఆత్మెల శ్రీనివాస్, శంకర్ గౌడ్, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ భాస్కర్ రాజు, రాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.
తాళ్లరాంపూర్‌లో అన్నదానం, జాతర..
ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ రామాలయం వద్ద వీడీసీ, హనుమాన్ మాలధారుల ఆధ్వర్యంలో అన్నదానం, జాతరను నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

