వర్ని/రుద్రూర్/మోస్రా(చందూర్), జనవరి 10 : రైతుబంధు సంబురాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పంటల సాగుకోసం పెట్టుబడి సహాయం చేతికందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సోమవారం రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్ మండలాల్లో వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి రైతులతో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు.
వర్ని మండలకేంద్రంలో భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. జాకోరా, జలాల్పూర్, మల్లారం, సత్యనారాయణపురం, తగిలేపల్లి తదితర గ్రామాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో ట్రాక్టర్లలో మండలకేంద్రానికి తరలివచ్చారు. మండల కేంద్రంలో ప్రారంభమైన ట్రాక్టర్ల ర్యాలీ శ్రీనగర్, వకీల్‌ఫారం గ్రామాల మీదుగా తిరిగి మండల కేంద్రానికి చేరుకుంది. సిద్ధాపూర్లోను రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి స్వయంగా ట్రాక్టర్లను నడిపి రైతులు, నాయకులు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అఫందిఫారం వద్ద జాకోరాకు చెందిన బాలయ్య అనే రైతు ఉత్సాహంతో డ్యాన్స్ చేశాడు. కోకల్‌దాస్ తండాకు చెందిన పలువురు గిరిజన యువకులు మండల కేంద్రంలో సాంప్రదాయ నృత్యం చేశారు. ర్యాలీ అనంతరం వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పలువురు రైతులను సన్మానించారు.
ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుతున్నదని విమర్శించారు. పంజాబ్ రైతులు మోదీని అడ్డుకున్నారని, తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంటుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా పథకాలకు రైతులకు వరమని అన్నారు. వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మూడ్ కవితాఅంబర్సింగ్, వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు కరీం, టీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, రుద్రూరు ఎంపీపీ సుజాతానాగేందర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సింగంపల్లి గంగారాం, సర్పంచులు, ఎంపీటీసీలు, సహకార సొసైటీల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్ మండలకేంద్రంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో పాల్గొన్న పోచారం సురేందర్‌రెడ్డి.. రైతులు, నాయకులతో కలిసి సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం గ్రామంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కోటగిరి మండలంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సంగయ్య, విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు మస్తాన్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఖాదర్, ఎంపీటీసీ సావిత్రి, కలీం, లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు. చందూర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో సీఎం, స్పీకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పోచారం సురేందర్‌రెడ్డితోపాటు రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో సీఎం, స్పీకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ పిట్ల ఉమాశ్రీరాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, ఎంపీటీసీ మమత, సర్పంచ్ సుమలతారాంరెడ్డి, గుమ్ముల పోశెట్టి, రైతులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో..
డిచ్పల్లి మండలం ఘన్‌పూర్‌లో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సవితారామకృష్ణ, సొసైటీ డైరెక్టర్ సతీశ్‌రెడ్డి, ఉపసర్పంచ్ రంజిత్‌కుమార్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి హరికిషన్, గ్రామశాఖ అధ్యక్షుడు గడ్డం గంగాధర్, సీనియర్ నాయకులు యెన్నోళ్ల రాజు, గంగాభూపతి, కొండూర్ సాయిలు, ఆమెటి రాజేశ్వర్, కిశోర్, బాలయ్య, చిన్నగంగారాం, రాజుల సాయిలు, చౌకి గంగాధర్, వడ్ల జనార్దన్, సమీర్ పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి మండల అర్గుల్ సొసైటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, వైస్ చైర్మన్ అప్పాల నడ్పి రాజన్న, డైరెక్టర్లు, సీఈవో తిరుపతిరెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.