e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home నిజామాబాద్ బెంబేలెత్తిస్తున్న చోరులు

బెంబేలెత్తిస్తున్న చోరులు

బెంబేలెత్తిస్తున్న చోరులు

ఆర్మూర్‌, మార్చి 28 : తాళం వేసిన ఇండ్లు, రద్దీ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్‌.. ప్రాంతం ఏదైనా డివిజన్‌ పరిధిలో దుండగులు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఆర్మూర్‌ పట్టణవాసులు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తిరిగి వచ్చేలోగా ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.
బస్టాండ్‌లు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమాయకులను టార్గెట్‌ చేసుకొని వేలాది రూపాయల విలువచేసే స్మార్ట్‌ఫోన్లను కండ్లు మూసితెరిచేలోగా ఎత్తుకెళ్తున్నారు. జేబులు కత్తిరిస్తూ పర్సులను ఎత్తుకెళ్తున్నారు. ఇండ్ల ముందు వాహనాలను నిలిపి ఉంచాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. రాత్రి అయ్యిదంటే ఆలయాల్లోని దేవతామూర్తుల ఆభరణాలు, హుండీల్లోని నగదును ఎత్తుకెళ్తున్నారు. ఎంతో కష్టపడి రైతులు సాగుచేసిన పసుపునూ వదలడం లేదు. నిఘా అంతంతమాత్రంగానే ఉండడంతో దొంగలు రెచ్చిపోతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు రికవరీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్న వారితో కొన్ని సందర్భాల్లో పోలీసులు ‘ఫిర్యాదు తీసుకుంటాం.. కేసు నమోదు చేయడం ఎందుకు? మీ వస్తువులు దొరికితే కోర్టుకు వెళ్లి తీసుకోవాల్సి వస్తుంది అని నచ్చజెప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేసి చోరీలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డివిజన్‌పరిధిలోని ప్రజలు కోరుతున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని చోరీలు…

  • ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లో గతేడాది డిసెంబర్‌ 9వ తేదీన నాలుగు చోట్ల దుండగులు చోరీకి పాల్పడి బంగారం ఎత్తుకెళ్లారు.
  • మామిడిపల్లి ప్రాంతానికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తి ఇంట్లో నుంచి ఆరు తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.
  • పట్టణంలోని హౌసింగ్‌బోర్డు రోడ్డులో ఉన్న రెండు అపార్ట్‌మెంట్లలో జనవరి 27వ తేదీన తాళం వేసిన ఫ్లాట్ల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.
  • విష్ణు అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఉండే సతీశ్‌రెడ్డి, వైష్ణవి అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఉండే చంద్రశేఖర్‌రెడ్డి ఫ్లాట్ల్లు, అదే అంతస్తులో కొనసాగుతున్న మిషన్‌ భగీరథ కార్యాలయం తాళాలను పగులగొట్టి చోరీ చేశారు. రూ.30వేల నగదుతోపాటు నాలుగు విదేశీ వాచీలను ఎత్తుకెళ్లారు.
  • ఈ ఏడాది ఫిబ్రవరిలో కోటార్మూర్‌లోని అన్నపూర్ణ కాలనీకి చెందిన కిరాణా వ్యాపారి స్వామి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 20 తులాల బంగారం, సుమారు రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు.
  • ఆర్మూర్‌ మండలం ఫత్తేపూర్‌లో రైతుల చెందిన సుమారు 40 క్వింటాళ్ల పసుపును దొంగలు ఎత్తుకెళ్లారు. తాము ఎంతోకష్టపడి సాగుచేసిన పసుపు చోరీకి గురవుతున్నదని ఫత్తేపూర్‌తోపాటు ఆర్మూర్‌ తదితర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • మామిడిపల్లిలోని ఎన్‌సీఎన్‌ కార్యాలయం సమీపంలో నివాసం ఉండే జగదీశ్వర్‌గౌడ్‌కు చెందిన వాహనాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు.
  • ఈనెల 5వ తేదీన పట్టణంలోని ఒక స్టీల్‌ ఎంపోరియానికి చెందిన టాటాఏస్‌ ట్రాలీని లోడ్‌తోసహా సుమారు రూ.10 లక్షల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు.

ఇవీ కూడా చదవండి..

ఒక‌టికంటే ఎక్కువ పాన్‌కార్డులుంటే భారీ పెనాల్టీ

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్.. అదేమిటంటే..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెంబేలెత్తిస్తున్న చోరులు

ట్రెండింగ్‌

Advertisement