e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home బిజినెస్ వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్.. అదేమిటంటే..

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్.. అదేమిటంటే..

న్యూఢిల్లీ‌: ‌ఫేస్‌బుక్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న వినియోగారుల ముంగిట్లోకి కొత్త అప్‌డేట్స్‌తో వ‌స్తున్న‌ది. ఎప్పటికప్పుడు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది‌. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి చేరువైన ఈ మెసేజింగ్‌ యాప్‌లో త్వరలో మరో అప్‌డేట్‌తో రానుంది. ఇప్పటికే ఉన్న డిజప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌లోనే మరో ఫెసిలిటీని చేర్చింది.

ఇప్పుడు ఉన్న ఫీచర్‌ ఆధారంగా మెసేజులు వారం రోజుల తర్వాత వాటంతట అవే డిలిట్ అవుతాయి. కానీ, 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్‌ అయిపోయే ఫీచర్‌ను వాట్సాప్‌ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాబీటా ఇన్ఫో వెబ్‌సైట్‌ తన ట్విటర్‌ ఖాతాలో తెలిపింది. డిజప్పియరింగ్‌ మెసేజెస్‌తో పాటు ఆర్కైవ్‌ మెసేజెస్‌ ఆప్షన్‌లో కూడా కొన్ని మార్పులు చేయనున్న‌ది.

- Advertisement -

ఆర్కైవ్‌ చేసిన కాంటాక్ట్‌ నుంచి మెసేజ్‌ వచ్చినా అన్‌ఆర్కైవ్‌ అవ్వకుండా ఉండే అప్‌డేట్‌ను వాట్సాప్ తీసుకురానుంది. ఈ ఆప్షన్లు మనం ఎనేబుల్‌ చేసుకుంటేనే కాంటాక్ట్ అన్‌ఆర్కైవ్‌ అవ్వకుండా ఉంటుంది. ఇవే కాక‌ వాట్సాప్‌ డిజప్పియరింగ్‌ మీడియా (ఫొటోలు, వీడియోలు), డెస్క్‌టాప్‌ వీడియో/ వాయిస్‌ కాలింగ్ వ‌స‌తుల్ని త‌న వినియోగ‌దారుల‌కు అందించ‌డానికి కూడా సిద్ధమవుతున్న‌ది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement