
కమ్మర్పల్లి/వేల్పూర్, ఏప్రిల్ 26 : ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ సాగించిన రాష్ట్ర సాధన ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా అన్ని విధాలా అండగా నిలిచింది. నిజామాబాద్ జిల్లాకు టీఆర్ఎస్తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. టీఆర్ఎస్కు తొలినాళ్లలో 2001 నుంచి అండగా నిలిచి ప్రజాశక్తిని, పటిష్టతను అందించింది. సీమాం ధ్ర పాలకుల వివక్ష నుంచి, తెలంగాణను వెను క పడేసిన సమైక్యవాదం నుంచి విముక్తి కల్పించడమనే ఏకైక ఎజెండాతో వచ్చిన గులాబీ పా ర్టీ జెండాకు ఏకగ్రీవ మద్దతు అందించిన ఉద్య మ గడ్డ మోతె.. ఇందూరు జిల్లాకే కాదు మలిదశ ఉద్యమానికి.. టీఆర్ఎస్ పార్టీకి.. ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంతో ప్రత్యేకం.
ఉద్యమ దిక్సూచిగా మోతె
మలిదశ ఉద్యమానికి బాల్కొండ నియోజక వర్గం వేల్పూర్ మండలం మోతె గ్రామం దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా వచ్చి న టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తామని 2001 మే 5వ తేదీన మోతె గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉద్యమ బాటలో మరెన్నో గ్రామా లు కదిలేలా స్ఫూర్తి నింపింది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మోతె స్ఫూ ర్తిని విశ్వవ్యాపితం చేశారు. దివంగత ఉద్యమ నేత వేముల సురేందర్ రెడ్డితో కలిసి మోతెకు వచ్చారు. మోతె గ్రామస్తులతో మాట్లాడారు. ఉద్యమానికి మోతె దిక్సూచిలా నిలిచిందని అభినందించారు. మోతె గడ్డ మీది మట్టిని ముడుపు కట్టారు.
రాష్ట్రం సాకారమయ్యాక తిరిగి ఆ మట్టి ముడుపును మోతె గడ్డపైనే విప్పుతానని ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2014 మార్చి 28 న వేముల సురేందర్ రెడ్డి, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మోతెకు వచ్చి ముడుపు విప్పారు. ఉద్యమ సమయంలో జరిగిన ఎన్నికల్లో 2014లో, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోతె టీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవ తీర్మానాలతో అండగా నిలిచింది. అదే తరహాలో మోతెను ముఖ్య మంత్రి కేసీఆర్ అభిమానిస్తారు. సాగు నీటి రంగ అభివృద్ధిలో వివక్ష కారణంగా తిప్ప లు ఎదుర్కొన్న గ్రామాలకు తమ గ్రామమే నిదర్శనమని మోతె గ్రామస్తులు పేర్కొనే వారు. అందుకే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వారి ఆకాంక్ష నెరవేరేలా మూడు కిలో మీటర్ల దూరంలో వృథా నీటిని మాటు కాలువ ద్వారా మోతె చెరువుకు మళ్లించి మోతె సాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు
ఉమ్మడి జిల్లాలో తిరుగులేని మద్దతు
ఉద్యమ నేతగా కేసీఆర్ ప్రారంభించిన మలి దశ ఉద్యమానికి, రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్కు ఆవిర్భావం నుంచి నిజామాబాద్ జిల్లాలో తిరుగులేని మద్దతు లభిస్తూనే ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భవించగానే కేసీఆర్ సంపూర్ణ విశ్వాసంతో 2001లో స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది టీఆర్ఎస్కు తిరుగు లేని మనో ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని ఇచ్చింది. అలా ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్కు ప్రారంభమైన మద్దతు తదుపరి అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజలు అందిస్తూ వస్తున్నారు. జిల్లాలో నాటి నుంచి నేటి వరకు సకల జనాదరణతో..లక్షల కార్యకర్తల సైన్యంతో తిరుగు లేని పార్టీగా కొనసాగుతున్నది.