
నిజామాబాద్, ఏప్రిల్ 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే వందలాది మందికి మహమ్మారి సోకుతోంది. రోజుకు పదుల సంఖ్యలో వచ్చే పాజిటివ్ కేసులు.. ఈ మధ్య కాలంలో ఉమ్మడి జిల్లాలో వందల నుంచి వేలకు చేరింది. కరోనా తీవ్రత తగ్గిందని, జన జీవనం సాధారణ పరిస్థితికి చేరుకుంటుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయం లో కేసులు పునరావృతం కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించకపోతే జరిమానా విధించాలని నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రాం తాల్లో మాస్కు వాడకం ఇసుమంతైనా కనిపించడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కనీస చర్యలు తీసుకోకపోవడంతో కొంత మంది రోడ్లపై ఇష్టానుసారంగా తి రుగుతున్నారు. వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లోనైతే భౌతిక దూరం పత్తా లేకుండా పోయింది.
కొవిడ్ నిబంధనలు గాలికి..
కరోనా కేసుల ఉధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ పలుచోట్ల జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారు. జన సందడి ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో కనీసం మాస్కులు ధరించాలనే నిబంధనలు అమలు కావడం లేదు. భౌతిక దూరం అనే ది పూర్తిగా మరిచిపోయారు. కరోనా జాగ్రత్తలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. కానీ ఎక్కడా క్షేత్ర స్థాయిలో నియంత్రణ చర్యల్లేవు. జిల్లాలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తుండడంతో రెండో వేవ్‌లో అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి రైళ్లలో రాకపోకలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్‌లో ఆయా ప్రాంతాల్లో పని చేసేందుకు మహారాష్ట్ర కూలీలు ఎక్కువ మంది వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరి రాకపోకలపై ఎక్కడా నియంత్రణ కానరావడం లేదు. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండగా ఆ ప్రాంతం నుంచి వస్తున్న వారు కనీసం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తద్వారా నిజామాబాద్‌లో వీరి ద్వారా తీవ్రంగా వైరస్ వ్యాపిస్తోంది.
కరోనా పరీక్షా కేంద్రాల్లో ఆగమాగం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెల రోజులుగా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. వాక్సిన్ వచ్చిందన్న ధీమాతో పాటుగా జనంలో పెరుగుతున్న నిర్లక్ష్యం రోజు రోజుకూ వైరస్ వ్యాప్తికి కారణంగా నిలుస్తోంది. కొవిడ్ టెస్టుల కోసం కేంద్రాల వద్దకు జనం బారులు తీరుతున్నారు. పీహెచ్సీ లు, ఏరియా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వద్ద ఉదయం 8గంటల నుంచే బారులు తీరుతున్నారు. టెస్టుల కోసం వచ్చిన వారు కూడా భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా లైన్ లో నిలబడుతున్నారు. ఉమ్మడి జిల్లా లో చాలా వరకు వైద్య సిబ్బంది సమయానికి రావడం లేద ని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నా ఉన్నతాధికారులెవరూ పట్టించుకోవడం లేదు. కరోనా వ్యాప్తి నియంత్రణతో పాటు పాజిటివ్ వచ్చిన రోగులకు మెరుగైన సేవలందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కొంత మంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పీహెచ్‌సీల్లో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. టెస్టులు చేస్తున్న ప్రాం తాల్లో భౌతికదూరం సరిగా పాటించకపోవడంతో అనుమానంతో టెస్టు కోసం వచ్చిన వారికి సైతం కరోనా అంటుకునే పరిస్థితు లు దాపురించాయి. పలుచోట్ల బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించడంలో ఎనలేని జాప్యం జరుగుతోంది. ఇదిలా ఉండగా వృద్ధులు క్యూలైన్లలో నిలబడలేకపోతున్నారు.
బాధ్యతగా వ్యవహరించాలి..
ప్రజలకు మాస్కులు పెట్టుకోవాలి, భౌతిక దూరం పాటించాలని పదే పదే చెబుతున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహించి చివరకు కొవిడ్ బారిన పడి దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. సెకండ్ వేవ్‌లో వైరస్ ఉధృతి వేగంగా ఉన్నందున అందరూ స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కేసులు పెరుగుతున్నప్పటికీ వైద్య సిబ్బంది మొక్కవోని దీక్షతో ప్రజల కోసం ప్రాణాలు తెగించి పని చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 3వేల మంది పారా మెడికల్ సిబ్బంది ఉంటే వీరిలో సెకండ్ వేవ్ ధాటికి 263 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా బారిన పడిన వైద్య సిబ్బందికి ఎల్లవేళలా అండగా ఉంటున్నాం. వారికి మానసిక ైస్థెర్యాన్ని అందిస్తున్నాం. సెకండ్ వేవ్ ఉధృతిని నిలువరించాలంటే ప్రజల సహకారం తప్పనిసరి. కనిపించని శత్రువుతో పోరాటంలో అజాగ్రత్త అస్సలే పనికి రాదు.
లక్షణాలు లేకుండానే ప్రాణాంతకంగా..
రెండో దశ కరోనా మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఇది విశ్వరూపం చూపుతోంది. అక్కడి నుంచి జిల్లాకు రాకపోకలు యథావిధిగా కొనసాగుతుండడంతో జిల్లాలోనూ దీని ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది.మామూలు జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండడం సాధారణంగా భావించి కొందరు పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. ఆర్ఏటీ, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నా నెగిటివ్ ఫలితాలు వెల్లడవుతుండడంతో ధీమాగా ఉంటున్నారు. అయితే అది అప్పటికే ఊపిరితిత్తుల్లోకి చేరి తేరుకునేలోపే ప్రమాదకరంగా మారుతున్నది. ఈ దశకు చేరకముందే ఏ మాత్రం జ్వరం ఉన్నా జాప్యం చేయకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవా లి. ఆర్ఏటీ, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలితే జ్వరం తగ్గకపోవడం, ఒళ్లు నొప్పులు ఉండడం, నీరసంగా ఉన్నట్లు అనిపిస్తే సిటీ స్కాన్‌కు వెళ్లి నిర్ధారణ చేయించుకుంటే ప్రయోజనం. కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయితే పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోవాలి.
ఇవీ కూడా చదవండి…
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి