ఖలీల్‌వాడి, జూలై 7 : అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బుధవారం పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ రోడ్డులోని మురళీకృష్ణ ఆలయం వద్ద బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. లక్ష్మీప్రియనగర్ నుంచి రైల్వే కమాన్ వరకు నేషనల్ హైవే పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. నీరుగొండ హనుమాన్ ఆలయంలో అష్టోత్తర శతకలశ సహిత మహాకుంభాభిషేకం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వరకు రోడ్డు వేయాలని, ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు.నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్, ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేసిన యువతీయువకులకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అందజేశారు. ఆయా కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, కెప్టెన్ శ్రీనివాస్, గంగామణి, నీరుగొండ ఆలయ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.