
కోటగిరి/ఆర్మూర్, మే 4 : రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిములకోసం సరఫరా చేసిన రంజాన్ కానుకలను స్థానిక నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా సీఎం కేసీఆర్ ముస్లిములకు దుస్తులు సరఫరా చేశారని గుర్తు చేశారు. ముస్లిములకు ప్రతి రంజాన్ పండుగకు దుస్తులు పంపిణీ చేయడంపై సీఎం కేసీఆర్‌కు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మైనార్టీ సెల్ నాయకులు బాబుఖాన్, మాజీ ఎంపీటీసీ ఎండీ సలీం, ఏఎంసీ డైరెక్టర్ నజీర్, జూబేర్, చోటేమియా, మసూద్ ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని ఆలూర్, సుర్భిర్యాల్, మగ్గిడి గ్రామాల్లోని మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఆలూర్‌లో సర్పంచ్ కల్లెం మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్, ఎంపీటీసీ లక్ష్మి మార్కంటి మల్లేశ్, ఆర్మూర్ వైస్ ఎంపీపీ మోతె భోజకళా చిన్నారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి, మగ్గిడి గ్రామంలో ఉపసర్పంచ్ నర్సయ్య, సుర్భిర్యాల్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు గోపిడి అశ్విన్‌రెడ్డి, ఇట్టెడి మోహన్‌రెడ్డి, సట్లపల్లి గణేశ్, మైనార్టీలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను అందజేశారు. నాయకులు, మైనార్టీలు పాల్గొన్నారు.