ఖలీల్‌వాడీ, మే 1: బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నగరంలోని కంఠేశ్వర్, న్యూహౌసింగ్ బోర్డు కాలనీ కమ్యూనిటీహాల్లో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. 19, 20, 41, 42వ డివిజన్లకు చెందిన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా హాజరై మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ప్రజలను జాగృతపర్చేందుకు వేదికగా ఆత్మీయ సమ్మేళనాలు నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ రావాలని దేశప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గల్లీలో, ఢిల్లీలో గులాబీ జెండా ఎగరాలన్నారు.
ఇందూరులో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీ హబ్‌ను నిర్మిస్తున్నామన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, బీఆర్ఎస్ అధ్యక్షుడు సిర్ప రాజు, సీనియర్ నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, కార్పొరేటర్ పొద్దుటూరి లావణ్యా జగత్‌రెడ్డి, గంగామణి, భారతి, శంకర్, భూమేశ్, సుజన్, ప్రసాద్, చాంగుబాయి, షేక్ అహ్మద్, తేజస్విని, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.