వినాయక నగర్ : నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road accident ) ఓ బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. సైకిల్‌పై వెళుతున్న (11) సంవత్సరాల బాలుడిని తప్పించబోయి కారు( Car ) బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి కి తీవ్ర గాయాలు కావడంతో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. సంబంధిత 3వ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపిన మేరకు వివరాలు .
హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం కారులో బాసరకు బయలు దేరారు. వీరు కంటేశ్వర్ బైపాస్ దుబ్బ ప్రాంతంలోని ప్రభుత్వ గిరిరాజ కళాశాల వద్ద కారుకు సైకిల్‌పై బాలుడు అడ్డొచ్చాడు. వేగంగా ఉన్న కారు బాలుడిని ఢీ కొట్టిన తరువాత రోడ్డు పక్కన బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో బాలుని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.