భారీ శబ్ధం చేసే బైక్ సైలెన్సర్లపై నిజామాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాలతో ఆర్టీఏ అధికారులతో కలిసి గురువారం జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్ధం చేసే సైలెన్సర్లను బిగించి నడుపుతున్న వాహనాలను పట్టుకున్నారు. దాదాపు 122కి పైగా వాహనాలను గుర్తించి వాటి సైలెన్సర్లను మళ్లీ వినియోగించకుండా చేశారు.
నగరంలోని ధర్నా చౌక్ వద్ద రోడ్ రోలర్ సహాయంతో ట్రాఫిక్ పోలీసులు సైలెన్సర్లను ధ్వంసం చేశారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, జిల్లా రవాణాశాఖ అధికారి ఉమా మహేశ్వర్రావు, ఏసీపీ శేషాద్రీరెడ్డి, ట్రైనీ ఐపీఎస్ చైతన్యరెడ్డి, ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ ఉన్నారు.