కామారెడ్డిరూరల్ జులై 25 : కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణ నుంచి రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ సాగింది.
గత నెల ఒకటో తేదీన ఢిల్లీ నుంచి ప్రారంభమైన ర్యాలీ సోమవారం కామారెడ్డి పట్టణానికి చేరుకున్నది. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ ఎస్సై సదానంద్, పట్టణ సీఐ నరేశ్ ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు. చిన్న పిల్లలతో పనులు చేయించకూడదని, మహిళలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.