Life Imprisonment | స్నేహితుడి ఆస్తి కాజేయడానికి పథకం వేసి ఆ మిత్రుడితోపాటు ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడికి నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత యావజ్జీవ ఖైదు విధించారు. ఈ హత్యలకు సహకరించిన నిందితుడి తల్లికి కూడా యావజ్జీవ శిక్ష విధించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల వాసి ప్రసాద్ అని వ్యక్తి ఆస్తి కాజేసేందుకు ప్రశాంత్ అనే వ్యక్తి పథకం వేశాడు. 2023 డిసెంబర్లో కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల పరిధిలో ఓ వ్యక్తి హత్య ఘటన వెలుగు చూసింది. ఈ కేసుపై దర్యాప్తు నిర్వహించిన పోలీసులకు మృతుడు మాక్లూర్ మండల వాసి ప్రసాద్ అని విచారణలో తెలిసింది. దీంతో లోతుగా జరిగే నిర్వహిస్తున్న పోలీసులకు మరికొన్ని విషయాలు బయట పడ్డాయి.
ప్రసాద్ భార్యతోపాటు ఉండక పోవడంతో ప్రశాంత్ అనే వ్యక్తిపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో అనుమానితుడైన ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో ప్రశాంత్ తాను చేసిన హత్యల సంగతి వెల్లడించారు. ప్రసాద్‌తోపాటు ఆయన కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేసినట్లు పోలీసులకు ప్రశాంత్ చెప్పాడు. ఈ కేసులో నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ప్రశాంత్ హత్యలో నిందితుడి తల్లి సైతం సహకరించినట్లు కేసు విచారణలో రుజువైంది. దీంతో ప్రసాద్, ఆయన తల్లికి యావజ్జీవ ఖైదు విధించారు.