నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 28 : రాష్ట్ర రైతాంగం సాగుచేస్తున్న ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని మార్కెట్ కమిటీలు, సొసైటీల పాలకవర్గాలు సోమవారం తీర్మానం చేశాయి. అనంతరం తీర్మాన పత్రాలను ప్రధాని మోదీకి పోస్టు చేశారు.బోధన్ ఏఎంసీలో చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ అధ్యక్షతన వడ్లను కేంద్ర ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలుచేయాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ మలావత్ ప్రకాశ్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.
ఆర్మూర్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని సొసైటీలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అంకాపూర్‌లో మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి సమక్షంలో తీర్మానం చేశారు. పిప్రి సొసైటీలో చైర్మన్ సోమ హేమంత్‌రెడ్డి, గోవింద్‌పేట్‌లో చైర్మన్ బంటు మహిపాల్, పెర్కిట్‌లో చైర్మన్ పెంట భోజారెడ్డి, ఆలూర్‌లో చైర్మన్ కల్లెం భోజారెడ్డి అధ్యక్షతన పాలకవర్గ సమావేశాలను ఏర్పాటుచేసుకొని తీర్మానం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ఆధ్వర్యంలో రైతులు తీర్మానం చేశారు.
వేల్పూర్ మండలంలోని పడగల్, వేల్పూర్, రామన్నపేట్, మోతె, పచ్చలనడ్కుడ సొసైటీల్లో చైర్మన్లు హన్మంత్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సంజీవ్, రాజన్న ఆధ్వర్యంలో తీర్మానాలుచేసి ప్రధాన మంత్రికి పోస్ట్ చేశారు.
భీమ్‌గల్ సొసైటీలో చైర్మన్ శివసారి నర్సయ్య ఆధ్వర్యంలో, మోర్తాడ్ సొసైటీలో చైర్మన్ కల్లెం అశోక్ ఆధ్వర్యంలో, ఏర్గట్ల సొసైటీలో చైర్మన్ బర్మ చిన్ననర్సయ్య ఆధ్వర్యంలో, ముప్కాల్ మండలం రెంజర్ల, వేంపల్లి విండోల్లో చైర్మన్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జక్క రాజేశ్వర్ ఆధ్వర్యంలో, కమ్మర్పల్లి మండలంలోని కమ్మర్పల్లి, చౌట్పల్లి, కోనాసముందర్, కోనాపూర్ పీఏసీఎస్‌లలో చైర్మన్లు రేగుంట దేవేందర్, కుంట ప్రతాప్ రెడ్డి, సామబాపు రెడ్డి, బడాల రమేశ్ ఆధ్వర్యంలో తీర్మానాలు చేశారు. బాల్కొండ సహకార సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
బోధన్ సహకార సంఘంలో అధ్యక్షుడు ఉద్మీర్లక్ష్మణ్ ఆధ్వర్యంలో, నవీపేట మండలంలోని బినోల, నవీపేట సహకార సంఘాల్లో చైర్మన్లు హన్మాండ్లు, న్యాలకంటి అబ్బన్న ఆధ్వర్యంలో, రెంజల్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ రమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి, ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు, ఇందల్వాయి, చందూర్ సొసైటీల చైర్మన్లు చింత శ్రీనివాస్‌రెడ్డి, ధర్మయ్యగారి రాజేందర్‌రెడ్డి, చింతపల్లి గోవర్ధన్‌రెడ్డి, మాధవరెడ్డి సమక్షంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్, నిజామాబాద్ రూరల్ మండలం గుండారం, మాధవనర్, ముత్తకుంట, పాల్ద సొసైటీల చైర్మన్లు ఆర్మూర్ గంగారెడ్డి, దాసరి శ్రీధర్, నాగేశ్వర్రావు, స్వామి, జితేందర్ అధ్యక్షతన పాలకవర్గసభ్యులు సమావేశమై తీర్మానాలు చేశారు. యాసంగి సీజన్లో రైతులు సాగుచేసిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మూడ్ కవితాఅంబర్సింగ్ అధ్యక్షతన పాలకవర్గసభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, డైరెక్టర్లు పాల్గొన్నారు. ధర్పల్లి మండలం కేశారం గ్రామపంచాయతీ పాలకవర్గసభ్యులు సర్పంచ్ సంగీతాభాస్కర్ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమై కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు.