నవీపేట/రెంజల్/ఎడపల్లి/ఆర్మూర్/మోర్తాడ్/ ఇందల్వాయి/శక్కర్‌నగర్/, నవంబర్ 19: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎమ్మేల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన నిరాధారణమైన ఆరోపణలను ఖండిస్తూ శనివారం జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎంపీ అర్వింద్ క్షేమాపన చెప్పాలని డిమాండ్ చేస్తూ మండలంలోని వివిధ గ్రామాల మహిళ ప్రజాప్రతినిధులు, మండల కేంద్రంలో నిరసన తెలిపారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు
హాజరై మాట్లాడారు. రెంజల్ మండలం కళ్యాపూర్ – నవీపేట ప్రధాన రోడ్డుపై సర్పంచి నిరంజని, రైతు బంధు మండల కన్వీనర్ కాశం సాయిలు తదితరులు ఎంపీ ఆరవింద్ దిష్టి బొమ్మను శవ యాత్ర నిర్వహించారు.
టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎడపల్లి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలోని సాటాపూర్ గేట్ వద్ద ఎంపి అర్వింద్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట మాదిగ హక్కుల దండోరా, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్, మాలమహానాడు, ఒడ్డెర సంఘం, ఎస్సీ ఉపకులాలు కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఎంపీ ఆరవింద్‌కు మైండ్ పనిచేయడం లేదని టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా మహిళా మాజీ ఉపాధ్యక్షురాలు, కమ్మర్పల్లి మండల మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లిలో ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కవితపై ఎంపీ అర్వింద్ నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.
బోధన్ మండలంలోని భవానీపేట్ గ్రామంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు భవానీపేట్ శ్రీనివాస్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ నీరడి లక్ష్మన్ ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అర్వింద్ క్షమాపణ చెప్పాలి
ఖలీల్‌వాడి, నవంబర్ 19 : మహిళలందరినీ జాగృతి అనే సంస్థ ద్వారా ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన కవితను రాజకీయంగా ఎదుర్కోలేక, అసత్య ఆరోపణలు చేస్తూ మహిళా ప్రజాప్రతినిధిపై చులకనగా మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. జిల్లాకేంద్రంలో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు.మహిళా ప్రజాప్రతినిధులపై పరుషపదజాలం ఉపయోగిస్తే రాబోయే రోజుల్లో మహిళా లోకం నీ ఓటమే లక్ష్యంగా కదులుతారని హెచ్చరించారు.
బీసీల పేరు తీసే హక్కుల ఎంపీ అర్వింద్‌కు లేదు
ధర్మపురి అర్వింద్ ఎంపీగా గెలిచి నాలుగు సంవత్సరాలైనా నోటి వెంట ఏనాడు బీసీ అనే పదం కానీ బీసీ కులాల పేరు తీయలేదని, కొత్తగా బీసీ కులాల పేరు తీయడం విడ్డూరంగా ఉందని బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆయన శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితతో అవమానపడి ఏ దిక్కు తోచక నేడు బీసీ కులాల పేరు తీయడం సిగ్గుచేటని, బీసీ నాయకులంటే హుందాగా ఉండాలని, బీసీలు అంటేనే వినయ విధేయతలకు మారుపేరని అన్నారు. ఈ నాలుగేండ్లలో బీసీలకు ఎంపీ అర్వింద్ ఏం చేశారో చెప్పాలని, ఆడవారికి, పెద్దలకు గౌరవం ఇవ్వని మీరు బీసీ అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అర్వింద్ బీసీ కులాల పేర్లను తన నోటి ద్వారా పలుకుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందన్నారు. నాయకులు బిల్లా మహేశ్, మహేంద్ర, దేవేందర్, లక్ష్మణ్‌గౌడ్, హన్మాండ్లు, శ్రీనివాస్, శంకర్, చంద్రకాంత్, రవి, సంజీవ్, బాలన్న, ఏగొండ స్వామి, గోపాల్ పాల్గొన్నారు.