ఖలీల్‌వాడి, నవంబర్ 10 : ఎంబీబీఎస్‌కు అర్హత సాధించిన నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన హారికను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా గురువారం క్యాంపు కార్యాలయంలో అభినందించారు. తనవంతు సహకారంగా వైద్య చదువు ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎటువం టి కోచింగ్ లేకుండా ఇంట్లోనే ఉంటూ యూ ట్యూబ్‌లో క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన హారికకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు, యువకులు హారికను ఆదర్శంగా తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు నారాయణ, మల్లేశ్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్, కోవూరి జగన్ పాల్గొన్నారు.
నగర రియల్ ఎస్టేల్ కన్సటల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హారికకు రూ. లక్షా 51వేల ఆర్థిక స హాయం అందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు వై.మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి, రఘువీర్, చీఫ్ అడ్వైజర్ రమేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.