ధర్పల్లి, అక్టోబర్ 31: గ్రామాల్లో సైతం పట్టణాల్లో మా దిరి పార్కులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లెలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. దీంతో గ్రామీణ ప్రజలు సైతం వనాల్లో సేద తీరుతున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ‘మియావాకీ’ పద్ధతిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలోని మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
మియావాకీ పద్ధతిలో తక్కువ స్థలంలో చిట్టడివి..
తక్కువ స్థలంలో చైనా, జపాన్ పద్ధతిలో ఎక్కువ మొక్క లు నాటి చిట్టడివి సృష్టించడమే మియావాకీ పద్ధతి. 2020 సంవత్సరంలో నాటిన మొక్కలు మూడు సంవత్సరాల కాలంలోనే ఏపుగా పెరిగి వృక్షాలుగా మారి చిట్టడవిలా ఏర్పడి కొత్త అందాలను సంతరించుకున్నాయి. దీంతో మండల కేంద్రంలోని ప్రజలు పల్లె ప్రకృతి వనంలో సేద తీరుతున్నారు.
అందరికీ చేరువలో ‘పల్లె ప్రకృతి వనం’…
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మూడు సంవత్సరాల క్రితం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం గ్రామానికే ఆకర్షణగా నిలుస్తున్నది. ధర్పల్లి సబ్‌స్టేషన్ ఆవరణలోని ఒక ఎకరం స్థలంలో ‘మియావాకీ’ పద్ధతిలో మొక్కలు నాటి పల్లె ప్రకృతి వనాన్ని ఏ ర్పాటు చేశారు. మరో ఎకరంలో జామ, దానిమ్మ, బొ ప్పాయి మొక్కలను నాటారు. మొక్కలన్నీ ఏపుగా పెరిగి ఆహ్లాదకరమైన పార్కుగా మారి అందరినీ ఆకర్షిస్తున్నది. ఒక పక్కన మినీ ట్యాంక్‌బండ్ అందాలు, మరో పక్క పల్లె ప్రకృతి వనంతో గ్రామం పర్యాటక ప్రాంతాన్ని తలపిస్తున్నది. ఒకప్పుడు పల్లెలంటే సరైన రోడ్లు, సదుపాయాలు లేక వెనుకబడిపోయాయి. కానీ ఇప్పుడు పల్లెలు పార్కులు, మెరిసే రోడ్లు, కాలుష్య రహిత వాతావరణం వెరసి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి.
నిత్యం పర్యవేక్షిస్తున్నాం
పల్లె ప్రకృతి వనంలో మియావాకీ పద్ధతిలో నాటిన మొక్కలను నిత్యం పర్యవేక్షిస్తూ కంటికి రెప్పలా కాపాడడంతో అవి ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. పల్లె ప్రకృతి వనంలో నీడనిచ్చే మొక్కలతో పాటు పూలు, అన్ని రకాల ఫలాల మొక్కలను నాటించాం. మొ క్కలన్నీ ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రతి రోజు ప్రకృతి వనాన్ని శుభ్రం చేయిస్తూ మొ క్క లకు, చెట్లకు నీటిని అందించేలా చర్యలు తీసు కుంటున్నాం.
-ఆర్మూర్ పెద్ద బాల్‌రాజ్, సర్పంచ్ ధర్పల్లి