ధర్పల్లి/ డిచ్పల్లి/ రుద్రూర్/ నిజామాబాద్ రూరల్/ సిరికొండ/భీమ్‌గల్/ మోర్తాడ్/ వేల్పూర్/ మాక్లూర్/నవీపేట/రెంజల్, అక్టోబర్ 30 : ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఐడీసీఎంఎస్, సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యుడు, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ ఆదివారం ప్రారంభించారు. ధర్పల్లి, ప్రాజెక్టు రామడుగు, హోన్నాజీపేట్, మైలారం, సల్లగరిగె, దుబ్బాక, ధర్పల్లి, గుడితండా, వాడి, హోన్నాజీపేట్, దమ్మన్నపేట్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్‌తో కలిసి ప్రారంభించారు.
జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్ సొసైటీ పరిధిలోని కలిగోట్, చింతలూరు గ్రామాల్లో ప్రాథమిక సహకార సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ సభ్యుడు జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ధాన్యం విక్రయించడంలో ఇబ్బందులు తలెత్తవద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి మద్దతు ధరను అందజేస్తున్నారని అన్నారు.
ధర్పల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్‌పాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు ఎం.రాజేందర్‌రెడ్డి, చెలిమెల చిన్నారెడ్డి, ధర్మయ్యగారి రాజేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్ జీయర్ కిశోర్‌రెడ్డి, సర్పంచులు ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్, మురళి, భగవంత్‌రెడ్డి, భాగవ్వ, టీఆర్ఎస్ నాయకులు సురేందర్‌గౌడ్, గోపాల్‌నాయక్, హన్మంతోళ్ల వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌నాయక్, పోతరాజు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ కుంచాల విమలారాజు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు డీకొండ శ్రీనివాస్, కలిగోట్, చింతలూరు సర్పంచులు చేతనా విజయ్‌రెడ్డి, సుకన్యాప్రసాద్,, సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్ మండలంలోని అక్బర్‌నగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ గంగామణీప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముజీబ్, ఎస్సై రవీందర్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిష్టయ్య, థామస్ పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం సొసైటీ పరిధిలో ఉన్న గుండారం, మల్కాపూర్(ఏ), జలాల్పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ సభ్యురాలు బొల్లెంక సుమలతా గోపాల్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ దాసరి శ్రీధర్, సర్పంచ్ లక్ష్మణ్‌రావు, ఎంపీటీసీ గంగాధర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు ఉమాపతి, సీఈవో అనంతలక్ష్మి, సర్పంచ్ శేఖర్‌గౌడ్, జలాల్పూర్ ఎంపీటీసీ శాంత సాయిలు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలోని తూంపల్లి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో తూంపల్లి, సర్పంచ్ తండా, గోప్యాతండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ సభ్యుడు మలావత్ మాన్సింగ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాములునాయక్, వైస్ చైర్మన్ అబ్బాస్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, సీఈవో దేవీలాల్, సర్పంచులు, డైరెక్టర్లు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండల కేంద్రంతోపాటు దేవీతండా, గన్నారం, గండి తండా, రూప్లానాయక్ తండా, మెగ్యానాయక్ తండా, ఇందల్వాయి తండా, రంజిత్‌నాయక్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ మారుతి, సర్పంచులు కుంట మోహన్‌రెడ్డి, పరశురాంనాయక్, కుమార్, కుమార్‌గౌడ్, పాశం సత్తెవ్వ, ఎంపీటీసీలు లావణ్యారవి, మారంపల్లి సుధాకర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు చిలువేరిగంగాదాస్,డైరెక్టర్లు గంగారెడ్డి, నల్లవెల్లి ముత్తెన్న, మల్లారెడ్డి, గంగారెడ్డి, చిన్నముత్తెన్న, పూర్యానాయక్ పాల్గొన్నారు.
భీమ్‌గల్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలో సికింద్రాపూర్, బడాభీమ్‌గల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బాదావత్ శర్మానాయక్, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు చింతకింది భూమేశ్వర్, సొసైటీ వైస్‌చైర్మన్ జిన్న శోభన్, సర్పంచులు గంగాధర్, రమేశ్‌నాయక్, సంజీవ్, ఎంపీటీసీ గరిపెట్టి గజేందర్గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మోర్తాడ్ మండలం సుంకెట్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ గుణవీర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ బద్దం రవి, సర్పంచ్ కడారి శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ గడ్డం మల్లేశ్, తీగల గణేశ్, సుదన్గౌడ్, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. వేల్పూర్ మండలకేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రాజేందర్ పరిశీలించారు.
సొసైటీ కార్యదర్శి సుంకరి కృష్ణ, సిబ్బంది ఉన్నారు. మాక్లూర్ మండలం మాదాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాక్లూర్ పీఏసీఎస్ చైర్మన్ గోపు లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు గంగాధర్, కాశీనాథ్‌రావు, ఉపసర్పంచ్ శశి, నాయకులు సతీశ్, భోజన్న, సత్యనారాయణరావు పాల్గొన్నారు. నవీపేట మండలంలోని నాగేపూర్‌లో సొసైటీ ఆధ్వర్యంలో, కమలాపూర్‌లో ప్రజాపరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ సంగెం శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో నాగేపూర్ సొసైటీ చైర్మన్ శైలేశ్‌కుమార్, సర్పంచ్ స్వరూపా మహిపాల్, వైస్ చైర్మన్ సత్యంరెడ్డి, ఎంపీటీసీ బేగరి జనార్దన్, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, కమలాపూర్ ప్రజా పరస్పర సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి,కుంచె వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
రెంజల్ విండో పరిధిలోని వీరన్నగుట్టలో ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ మ్యాక విజయాసంతోష్ ప్రారంభించారు. సర్పంచ్ బైండ ్లరాజు, వీరన్నగుట్ట తండా సర్పంచ్ గణేశ్‌నాయక్, రెంజల్ ఇన్చార్జి విండో చైర్మన్ మొయినుద్దీన్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు భూమేశ్, లింగారెడ్డి, జూబేర్బేగ్ పాల్గొన్నారు.