నిజామాబాద్ క్రైం,అక్టోబర్ 30: నిజామాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున 2.55 గంటలకు కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాటు సారా తయారీకి వినియోగించే పదార్థాలను గుర్తించారు. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా తిరుపతి వెళ్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు నిజామాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో 338 కేజీల నల్ల బెల్లంతో పాటు 75 కేజీల ఆలం(స్ఫటిక) ఉన్న సంచులను గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. తనిఖీలను గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన పదార్థాలను సారా తయారు చేసేందుకు ఉపయోగిస్తారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పి.వేణుమాధవ్ రావ్ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై బి.రామ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు నారాయణ రెడ్డి, శ్రీను , ప్రసాద్, రామ్ బచ్చాన్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ టీమ్ ప్రతినిధి రాజ్ శేఖర్ పాల్గొన్నారు.