శక్కర్‌నగర్/ఆర్మూర్, అక్టోబర్ 27: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని కేవీ రెడ్డి మెమోరియల్ లయన్స్ కంటి దవాఖానలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని నిజామాబాద్ సీపీ కెఆర్ నాగరాజు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా బోధన్ లయన్స్ కంటి దవాఖానలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు, సహకరించిన లయన్స్ కంటి దవాఖాన ప్రతినిధులు, లయన్స్ ప్రతినిధులు, రక్తదాతలను అభినందించారు. పోలీసు అధికారులు, వలంటీర్లు, రక్తదాతలకు సీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్, పట్టణ, రూరల్ సీఐలు బీడీ ప్రేమ్‌కుమార్, జి. శ్రీనివాస రాజు, రుద్రూర్ సీఐ జాన్‌రెడ్డి, ఎస్సైలు, లయన్స్ ప్రతినిధులు బసవేశ్వర్‌రావు, కొడాలి కిశోర్ పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో సీపీ నాగరాజు ఆధ్వర్యంలో కొవ్వుత్తుల ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్, తహసీల్దార్ వేణుగోపాల్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఎస్‌హెచ్‌వో సురేశ్‌బాబు, ఎస్సైలు, లయన్ గ్రీన్ సభ్యులు, గురుకుల విద్యార్థులు పాల్గొన్నారు.
ఎడపల్లి, అక్టోబర్27: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో సైబర్ నేరాలపై ఏసీపీ కిరణ్‌కుమార్ అవగాహన కల్పించారు. సైబర్ మోసాల నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాలతోపాటు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. బోధన్ రూరల్ సీఐ శ్రీనివాస్ రాజు, ఎస్సై పాండేరావు, ప్రిన్సిపాల్ సుహాసినీరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గ్గొన్నారు.