ఆర్మూర్, అక్టోబర్ 15: మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి శనివారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దండు మల్కాపూర్ గ్రామంలోని అన్ని వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి వారి యోగాక్షేమాలను అడిగి తెలుసుకొని ఓటు వేయాలని కోరారు. దండు మల్కాపూర్‌కు చెందిన 431 మంది గ్రామస్తుల భూ సమస్యను మంత్రి కేటీఆర్ పరిష్కరిస్తారని జీవన్‌రెడ్డి చెప్పారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎప్పుడైనా గ్రామానికి వచ్చాడా అని గ్రామస్తులను అడిగారు. తన కాంట్రాక్ట్‌ల కోసం రాజగోపాల్‌రెడ్డి ఈ ఉప ఎన్నికలు తెచ్చాడన్నారు. రాజగోపాల్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు పూజా నరేందర్, పండిత్ ప్రేమ్, ఆకుల రజనీశ్, మాక్లూర్ రంజిత్, ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి, పస్క నర్సయ్య, వాకిడి సంతోష్‌రెడ్డి, మాస్త ప్రభాకర్, మేడిదాల రవిగౌడ్, గాదేపల్లి చిన్నారెడ్డి, దేగాం ఇట్టెడి లింగారెడ్డి, ఆకుల రాము, సింగిరెడ్డి మోహన్, పండిత్ ప్రేమ్, సట్లపల్లి గణేశ్, కల్లెం భోజారెడ్డి, సుద్దపల్లి నర్సయ్య, మచ్చర్ల సాగర్, మాక్లూర్ సత్యనారాయణ, తంబూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
చందూర్, అక్టోబర్ 15 : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థికి మద్దతుగా చందూర్ మండల పార్టీ నాయకులు శనివారం ప్రచారం చేశారు. మునుగోడులోని వివిధ గ్రామాల్లో ఏడు రోజులుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తున్నారు. కార్యక్రమంలో నాయకులు అంబర్‌సింగ్, బొడ్డోళ్ల సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.