వేల్పూర్, అక్టోబర్ 9 : అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఉన్న కుల సంఘాల భవనాలు, ఇతర అభివృద్ధి పనులకు మంత్రి నిధులు మంజూరు చేశారు. సు మారు 108 కుల సంఘాలకు రూ. 5 కోట్ల నిధులు మం జూరుచేయగా.. ఇందుకు సంబంధించిన ప్రొసీడిం గ్ కాపీలను ఆదివారం వేల్పూర్‌లోని తన నివాసంలో బాల్కొం డ, ముప్కాల్, మెండోరా, భీమ్‌గల్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన కుల సంఘాల ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవనా లు త్వరగా నిర్మించుకుని సంఘ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. నిధులు మంజూరు చేసినందుకు మం త్రికి కుల సంఘాల సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షులు, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో యువకుల చేరిక
కమ్మర్పల్లి, అక్టోబర్ 9 : మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశమంతటా అందాలని కోరుకుంటున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ కొత్తగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీని యువత స్వాగతిస్తున్నదని తెలిపారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌లోని త్రీడీ యూత్, డ్రాగన్ యూత్, రోరింగ్ లయన్స్ యూత్, గరుడ యూత్‌కు చెందిన 50 మంది యువకులు, స్థానిక యువజన నాయకుడు రఘు గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్( బీఆర్ఎస్)లో చేరారు. వారికి మంత్రి వేముల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజక వర్గంలో మంత్రి వేముల కృషితో అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు యువకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో పరిస్థితులు రోజు రోజుకూ దిగ జారుతున్నాయన్నారు. మోదీ, అమిత్ షా పేదలను కొట్టి పెద్ద గద్దలకు లక్షల కోట్లు పంచి పెడుతున్నారని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించిన బీజేపీ ఒక్క ఉద్యోగమైనా ఇవ్వలేదు సరి కదా ఉన్న ఉద్యోగాలు ఊడ గొడుతూ వం చన చేసిందన్నారు. దీనిని గమనిస్తున్న యువత బీఆర్ఎస్ అవసరాన్ని గుర్తించి అందులో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, ఉపాధ్యక్షుడు ఏనుగు గంగారెడ్డి, యూత్ విభాగం నాయకుడు రాజు పాల్గొన్నారు.