ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 10: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఆయన శనివారం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ భూస్వాములకు వ్యతిరేకంగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రధాన పాత్ర వహించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బల్దియా చైర్మన్ కుడుముల సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీశ్‌కుమార్, నాయకులు శ్రావణ్‌కుమార్, భూంగారి రాము, చింతల శంకర్, లింగం, ముజ్జూ, సంగని పోచయ్య, గాదె తిరుపతి, శ్రీనివాస్ నాయక్, రజక సంఘం మండల అధ్యక్షుడు అయ్యన్నగారి సాయిప్రసాద్, పట్టణ అధ్యక్షుడు పర్వయ్య, సభ్యులు బంజపల్లి ఈశ్వర్, లక్ష్మణ్, బాలయ్య, సత్యనారాయణ, స్వరూప, నాగమణి, శివ, నాగరాజు, చరణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ఐలమ్మ విగ్రహాలకు నివాళి..
నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 10 : బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో గ్రామ రజక సంఘం అధ్యక్షుడు గోపన్‌పల్లి సాయిలు కులపెద్దలతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీర్కూర్తోపాటు కిష్టాపూర్ తదితర గ్రామాల్లో చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మాచారెడ్డి మండలం గజ్యానాయక్‌తండా, ఎక్స్‌రోడ్ గ్రామాల్లో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎడపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలంలోని అడ్లూర్, గర్గుల్, క్యాసంపల్లి, నరసన్నపల్లి తదితర గ్రామాల్లో ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి యాదవ్, రజక సంఘం సమితి జిల్లా అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ వర్ధంతిలో సర్పంచ్ సురేశ్ పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని సంఘం సభ్యులు సర్పంచ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
గాంధారి, జువ్వాడి గ్రామాల్లోని ఐలమ్మ విగ్రహాలకు రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌నాయక్, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, గాంధారి విండో చైర్మన్ సాయికుమార్, గాంధారి సర్పంచ్ సంజీవ్, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, రజక సంఘ నాయకులు బుర్రి సంజీవ్, సంగయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్‌లో ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం ప్రతినిధులు పున్నం రాజయ్య, ఆశన్న తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. లింగంపేటలో టీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకుడు ఫతీయొద్దీన్, సీపీఎం నేతలు సావిత్రి, పెద్దమ్మ, వెంకటలక్ష్మి, రజక సంఘం నాయకులు సంగ్యపు సాయిలు, భూపతి, ఒంటరి సాయిలు, చాకలి సాయిలు, పోచయ్య, రాములు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పిట్లంలో నిర్వహించిన కార్యక్రమంలో పిట్లం రజక సంఘం అధ్యక్షుడు చిల్వెరి హన్మాండ్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విజయ్, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు జొన్న శ్రీనివాస్‌రెడ్డి, విండో చైర్మన్ శపథంరెడ్డి, నాయకుడు నర్సాగౌడ్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు శశిధర్, రజకసంఘం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌రాజ్, రజక సంఘం మాజీ మండలాధ్యక్షుడు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి, బ్రాహ్మణపల్లి, కృష్ణాజివాడి గ్రామాల్లోని చాకలి ఐలమ్మ విగ్రహాలకు వైస్ ఎంపీపీ నర్సింహులు, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్యాంరావు, సర్పంచ్ భూషణం, రజక సంఘం నాయకులు రాజయ్య, నర్సింహులు, ఆశన్న తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.