ఆర్మూర్/బోధన్ రూరల్/ఎడపల్లి, సెప్టెంబర్ 6 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ సక్సెస్ కావడం ఇందూరు ప్రజల విజయమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. సభకు భారీగా తరలివచ్చిన ఇందూరు ప్రజలకు ఆయన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సభ విజయవంతం కావడానికి కీలక భూమిక పోషించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. వీరితో పాటు జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలకు ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బుద్దెరాజేశ్వర్, మండల అధ్యక్షుడు నర్సన్న మాట్లాడారు. సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదలు తెలిపారు. బోధన్ నియోజక వర్గ ఎమ్మెల్యే షకీల్ పిలుపు మేరకు రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు.
ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూరా షకీల్, ప్రధాన కార్యదర్శి సిర్పా సుదర్శన్, ఖాజాపూర్ సర్పంచ్ చింతపు నాగయ్యతోపాటు నాయకులు ఉన్నారు. ఎడపల్లిలోని రైతు వేదికలో సీఎం సభ విజయవంతమైనందుకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేరడి శ్రీరామ్, ఉపసర్పంచ్ ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. ఇకపై కూడా టీఆర్ఎస్ శ్రేణులు రాబోయే ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్‌ను గెలిపించుకోవాలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచులు గంగాప్రసాద్, విజయకుమార్, నాయకులు గుంజరి రెడ్డి, నాయుడు పోతన్న, అహ్మద్, మహబూబ్, బాబర్, అజయ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.