శక్కర్‌నగర్/భీమ్‌గల్, సెప్టెంబర్ 6 : బోధన్‌లోని శక్కర్‌నగర్, రాకాసీపేట్తోపాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వినాయకుల నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి సూచించారు. వినాయకులు నిమజ్జనం చేసే పసుపువాగు, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని గణపతుల బావి, శక్కర్‌నగర్‌లో ఉన్న బావిని ఆమె మున్సిపల్ కమిషనర్ రామలింగం, అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. వినాయకుల శోభాయాత్ర కొనసాగే రూట్లను పరిశీలించి రోడ్లపై గుంతలు ఉంటే వాటిని పూడ్చాలన్నారు. గణపతులను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో క్రేన్లు, ఈతగాళ్లు, లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల నిర్వాహకులు నిమజ్జనం ప్రశాంతంగా జరిపించాల ని సూచించారు. వదంతులు నమ్మొదని అన్నారు. శోభాయాత్ర వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈఈ శివానందం, ఏఈ శ్రీనివాస్, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, నాయకులు వల్లూరి రవిచంద్ర, ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్తోపాటు గ్రామాల్లో గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని కుంటలు, చెరువుల వద్ద కొనసాగుతున్న పనులను మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రాఘవుల కుంట వద్ద చెరువును పరిశీలించి పలు సూచనలు చేశారు. కమిషనర్ వెంట కౌన్సిలర్లు నర్సయ్య, లింబాద్రి, నాయకులు కన్నె సురేందర్ తదితరులున్నారు.
వలంటీర్ల నియామకం
బోధన్ పట్టణంలో వరుసగా నిర్వహించే వినాయకుల నిమజ్జనం, జలాల్ బుకారీ దర్గా ఉర్సు సందర్భంగా వలంటీర్లుగా పనిచేసే ఉత్సాహవంతులు బోధన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్ ఒక ప్రకటనలో కోరారు. పండగల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, ప్రజలకు సేవలు అందించేందుకు వలంటీర్లను నియామకం చేస్తున్నామని వెల్లడించారు. ఉత్సాహవంతులైన యువకులు 9440795430 నంబర్‌కుగాని, నేరుగా పట్టణ పోలీస్ స్టేషన్లో గాని సంప్రదించాలని ఆయన సూచించారు.
నవీపేటలో..
గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎంపీపీ సంగెం శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ శాంతి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎటువంటి అవాంఛనీ య ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు, మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ వీర్‌సింగ్, ఎస్సై రాజరెడ్డి, ఎంపీడీవో గోపాలకృష్ణ, ఇరిగేషన్ ఏఈ ప్రణయ్‌రెడ్డి, మండపాల నిర్వాహకులు కృష్ణ, శ్రీకాంత్, ధీరేందర్శేఖర్, మండల కోఆప్షన్ సభ్యుడు అల్తాఫుద్దీన్, బుచ్చన్న, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.