డిచ్పల్లి, సెప్టెంబర్ 5 : నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటా రు.
అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. అనంతరం మూడు నిమిషాల పాటు పార్టీ కార్యాలయ పరిసర ప్రాంతా లను పరిశీలించి అక్కడున్న పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు అభివాదం చేసి కలెక్టరేట్‌కు పయనమయ్యారు. ముఖ్యమంత్రితో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, మహ్మద్ షకీల్, హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, నగర మేయర్ దండు నీతూకిరణ్, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొతంగల్ రాంకిషన్‌రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.